మండల రెవెన్యూ అధికారి సబితారాణి, ఉప తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జి సీడీపీఓ శోభారాణి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా అంగన్వాడీల ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను వివరించారు. ముఖ్యంగా కిశోర బాలికలకు బాల్యవివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
అదనంగా, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వారి బరువు, ఎత్తు, పోషకాహార స్థితి, ఆరోగ్య పరిస్థితులపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కృష్ణవేణి, బ్లాక్ కోఆర్డినేటర్, సఖి, హెల్ప్‌లైన్, భరోసా ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.: క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడంలో అంగన్వాడీల పాత్ర కీలకం


