ఈ కార్యక్రమాల భాగంగా కల్వకుర్తి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, మహాత్మా జ్యోతిబా పూలే విద్యాసంస్థ, అచ్చంపేట అక్షరం స్టడీ హాల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తాడూరు PACS సొసైటీ, ఊరుకొండలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్ ప్రాంతాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు. విద్యార్థినులకు “మీ రక్షణ మా బాధ్యత” అనే సందేశంతో షి టీమ్ సభ్యులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
మహిళల భద్రత, వేధింపుల నివారణ, అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించే విధానం, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, హెల్ప్‌లైన్ సేవల వినియోగం వంటి అంశాలను అధికారులు వివరించారు. విద్యార్థినులు తమ సమస్యలను భయపడకుండా తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట సీఐ నాగరాజు, ఎస్సై సద్దాం, తాడూరు ఎస్సై గురుస్వామి, షి టీమ్ ఎస్సై రజిత, ఏఎస్ఐ రాజ్యలక్ష్మి, షి టీమ్ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.: జిల్లాలో షి టీమ్ అవగాహన కార్యక్రమాలు.. విద్యార్థినులకు భద్రతపై చైతన్యం



