ລ້ Greater Hyderabad Municipal Corporation పరిధిలోని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్గా సేవలందించిన హేమంత కేశవ్ పాటిల్ను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆర్డీవోలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం, అధికారుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో ఆలస్యం ఉండకూడదని, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు చేరువైన పరిపాలన అందించడం తన లక్ష్యమని హేమంత కేశవ్ పాటీల్ పేర్కొన్నారు.: జిల్లా 9వ కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతల స్వీకరణ




