నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో భాగంగా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం క్లాస్మేట్ క్లబ్ మరియు టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు సంఘం సంయుక్తంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, శ్యాంప్రసాద్ లాల్ చేతుల మీదుగా విద్యార్థిని తండ్రి రామస్వామికి నగదు ప్రోత్సాహం అందజేశారు. పేదరికంలో ఉన్నప్పటికీ ఉన్నత చదువుల కోసం కృషి చేస్తున్న అనూషను అధికారులు అభినందించారు. పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదని, ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

విద్య పూర్తి చేసిన తరువాత సమాజంలోని నిరుపేదలకు సహాయం చేయాలనే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని అధికారులు పేర్కొన్నారు. క్లాస్మేట్ క్లబ్ నిర్వహిస్తున్న “365 రోజుల సేవా కార్యక్రమం”లో భాగంగా ఇది 111వ రోజు కార్యక్రమం కాగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో డా. ఆకారపు భాస్కర్, వాస రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.: బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *