శని గ్రహ దోష నివారణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి తిలతైల అభిషేకం చేశారు. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థించారు.
ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, ఈ మాసంలో స్వామివారిని భక్తితో పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి వ్యక్తి తన జన్మ రీత్యా మరియు గోచార రీత్యా శనిగ్రహ ప్రభావాలను తగ్గించుకోవడానికి శనేశ్వర స్వామిని శక్తిమేరకు ఆరాధించాలన్నారు.
ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలానికి చెందిన బ్రహ్మసూత్రం గల పరమశివునికి కూడా భక్తులు రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. అలాగే నందీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ పూజలు భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో ధార్మిక వాతావరణాన్ని సృష్టించాయి.: శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేక పూజలు



