నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న Collectorate Office ఆవరణలో ఈ నెల 20వ తేదీన మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి కేంచే రాజేష్ తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించే ఈ వేడుకలకు లింగ బలిజ కులస్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. మహాత్మా బసవేశ్వరుని సేవలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకుంటామని తెలిపారు.
బసవేశ్వరుని ఆలోచనలు సమాజంలో సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలిచాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ వేడుకలు సామాజిక ఐక్యతను పెంపొందించే వేదికగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.: ఏప్రిల్ 20న మహాత్మా బసవేశ్వర జయంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *