మహిళలు, బాలికలకు అండగా షీ టీం..
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా షీ టీంను సంప్రదించాలని ASI విజయలక్ష్మి సూచించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా షీ టీంను సంప్రదించాలని ASI విజయలక్ష్మి సూచించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, అభ్యసన సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ ఫలితాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలర్మేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో శనివారం స్వామి అమ్మవార్ల కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. 36 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలీ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల కోసం చేపట్టిన పర్యటనను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నా నిర్వహించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, RDO కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మర్రి…
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చుతోందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో 43 ఏళ్ల మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి కౌలు విషయంలో ఏర్పడిన విభేదాలే హత్యకు కారణమని తెలిపారు. మృతురాలి బంధువైన కరావత్ హీరమ్మను అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి…
నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయాల పరిశుభ్రత, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వినియోగంలో లేని రికార్డులను నిబంధనల ప్రకారం తొలగించాలని,…
నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని…
కల్వకుర్తి మండలం బెక్కేర గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య పరిశీలించారు. రీ-సర్వేపై ప్రజల అపోహలను తొలగించి, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.