నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లి రవి చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఘనంగా కొనసాగింది. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ బస్సు యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజలు వందలాదిగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడం ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. ప్రచార రథానికి ప్రజలు విశేష ఆదరణ చూపడంతో బస్సు యాత్రకు భారీ స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, “నేను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు, ప్రజా శ్రేయస్సు కోసం. నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటాను” అని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా, సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలో 550 పడకల ఆసుపత్రి ఏర్పాటు వంటి కీలక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
ఈ బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వ పనితీరు ప్రజలకు మరింత చేరువ అవుతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.: తిమ్మాజిపేటలో ఘనంగా ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *