నాగర్ కర్నూల్, జూన్ 10:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి మరియు శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం నేటితో ముగిసినట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కే. బాలరాజు తెలిపారు.
మార్చి 30 నుంచి ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ ప్రయాణికులకు చల్లని త్రాగునీరు, గ్లూకోజ్ వాటర్, మజ్జిగతో కూడిన అంబలిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
సత్యసాయి సేవా సమితి సభ్యులు, సాయి భక్తులు, శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్, దాతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. సహకరించిన ప్రతి భక్తుడికి, దాతలకు స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ కన్వీనర్ హాకీమ్ విశ్వప్రసాద్, కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, సత్యసాయి యువజన, మహిళా, భజన మండలి సభ్యులు, సేవాదళ్, బాలవికాస్ గురువులు, సాయి భక్తులు మరియు ఇతర బాధ్యులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం ముగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *