ఈ సందర్భంగా టీఎన్జీవో నాయకులు జిల్లా అధికారికి ఉద్యోగుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించి, జిల్లాలో ప్రజా సేవల పరంగా సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగి ప్రజలకు మెరుగైన సేవలు అందాలని నాయకులు అభిప్రాయపడ్డారు.
జిల్లాకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆర్. పాండు సమర్థవంతమైన పాలన అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ టీఎన్జీవో ప్రతినిధులు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బావండ్ల వెంకటేష్, కోశాధికారి బాలరాజు, ఉపాధ్యక్షులు కోట్ర బాలాజీ, చెన్నకేశవులు, యూనిట్ అధ్యక్షులు నసిరుద్దీన్, కార్యదర్శి మలిపెద్ది సురేష్ కుమార్, జిల్లా నాయకులు కళ్యాణ్ కృష్ణారావు, లింగం, రమేష్, ఎం. ఆనంద్, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.: జిల్లా రెవెన్యూ అధికారిని ఘనంగా సన్మానించిన టీఎన్జీవో నాయకులు

