Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

TGRTC సమ్మె నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు

TGRTC సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీస్ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి లేకుండా ధర్నాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని SDPO హెచ్చరించారు.

బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం

నాగర్ కర్నూల్ జిల్లాలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. పేదరికంలోనూ చదువులపై కృషి చేస్తున్న విద్యార్థిని అభినందించారు.

శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేక పూజలు

నంది వడ్డేమాన్‌లో శ్రీ శనేశ్వర స్వామికి శనివారం తిలతైల అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. శని దోష నివారణ కోసం భక్తులు భారీగా పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ రోగులకు ప్రత్యేక ఏర్పాటు

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక బెడ్లు, 24 గంటల వైద్య సేవలు సిద్ధం. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు.

మద్యం మత్తులో యువకుల హంగామా

నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపిన యువకులు ప్రమాదానికి కారణమై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

జిల్లాలో జనగణన శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం

జిల్లాలో జనగణన పనుల కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్లపై బిఎస్పీ ఆందోళన

విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బిఎస్పీ డిమాండ్ చేస్తూ, రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరింది.

రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ హెచ్చరిక

నాగర్ కర్నూల్ జిల్లాలో రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.