ఆసుపత్రిలో వడదెబ్బతో వచ్చే రోగుల కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేసి, అవసరమైన ఐవీ ఫ్లూయిడ్స్, మందులు, తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రొఫెసర్ డా. బి. సూర్యనారాయణ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల్లో వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
వైద్యులు సూచించిన మేరకు ఎండ సమయంలో తగినంత నీరు తాగడం, మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆసుపత్రి అధికారులు విజ్ఞప్తి చేశారు.: ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ రోగులకు ప్రత్యేక ఏర్పాటు
