Tag: Nagarkurnool News

వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజారోగ్య సేవలకు జీవితాన్నే అంకితం చేసిన DM&HO డాక్టర్ స్వరాజ్యలక్ష్మి

నాగర్‌కర్నూల్ జిల్లా DM&HO డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి గారికి ఘన పదవీ విరమణ సన్మానం నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో మూడు దశాబ్దాల సేవలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశంసించారు.

నంది వడ్డేమాన్‌లో బడిబాట ర్యాలీ.. ఉత్తమ విద్యార్థులకు ఘన సన్మానం

నంది వడ్డేమాన్ గ్రామంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించి, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

నాగర్ కర్నూల్‌లో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన వారికి మహబూబ్‌నగర్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తెలంగాణ జన సమితి నాల్గవ ప్లీనరీ పోస్టర్ల విడుదల

నాగర్ కర్నూల్‌లో తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికలను జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం ఖాజా ఖాన్ రమేష్, హర్ష రాజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పాల్గొని భగీరథుని సేవాభావం, పట్టుదల యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తప్పనిసరి

నాగర్‌కర్నూల్ జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు ప్రారంభం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ప్రారంభమై, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

నాగర్ కర్నూల్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు

నాగర్ కర్నూల్‌లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగా డిఇఓ రమేష్ అభినందించారు