Category: latest News

టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థనలు

నాగర్ కర్నూల్‌కు చెందిన టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తూడుకుర్తి యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు.

తుడుకుర్తి పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తుడుకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

పాలెం పీహెచ్‌సీలో 25న మెగా ఉచిత వైద్య శిబిరం

నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25న స్పెషలిస్ట్ వైద్యులతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.

ప్రజావాణిలో 9 ఫిర్యాదులు స్వీకరణ

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ 9 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి అవసరం

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 34 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని అదనపు కలెక్టర్లు సూచించారు.

సోమశిలలో అరుదైన దృశ్యం

నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో కృష్ణా నది బ్యాక్‌వాటర్ తగ్గడంతో సప్తనదుల సంగమ క్షేత్రంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం పూర్తిగా దర్శనమిస్తోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

పాలెం వెంకన్న దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.

తిమ్మాజీపేట కేజీబీవీపై డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు

ఇంద్రకల్‌లో ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఇంద్రకల్ గ్రామంలో విజయవంతంగా ముగిసింది. గ్రామాభివృద్ధి, వ్యవసాయ అవగాహన కార్యక్రమాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.