నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం సిరవిన్ బయోలాజికల్ లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని, హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్లో జూనియర్ ఆఫీసర్ (అనిమల్ ఫార్మ్ డెవలప్మెంట్), ఎగ్జిక్యూటివ్ (అనిమల్ ఫార్మ్ డెవలప్మెంట్) పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.

డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలతో ఏప్రిల్ 6న సోమవారం ఉదయం 11 గంటలకు కళాశాలలో హాజరుకావాలని సూచించారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మరిన్ని వివరాలకు 9848289763 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, దశరథం, ముజఫర్, నరేష్, రాఘవేందర్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో ఏప్రిల్ 6న జాబ్ మేళా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *