రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా అంతటా అమలు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాదం లేదా నేరం జరిగిన వెంటనే డయల్ 100, 112 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తే, పోలీసులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం బాధితులు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లలేని పరిస్థితుల్లో వారికి సౌకర్యవంతమైన సేవలు అందించడం. ఫోన్ కాల్ లేదా సోషల్ మీడియా ద్వారా కూడా సమాచారం అందించి ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.
మూగ, చెవిటి, దృష్టి లోపం ఉన్న వ్యక్తుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక అధికారులను కూడా పంపించి వారి సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసింగ్ సేవలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా మారి ప్రజలకు చేరువ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.: బాధితుల వద్దకే పోలీస్ సేవలు

