జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ‘హేలీ టూరిజం’ సేవలను ఏప్రిల్ 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సేవల ద్వారా హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలం వరకు హెలికాప్టర్ ప్రయాణం ఏర్పాటు చేయనున్నారు. ఈ యాత్రలో పర్యాటకులు కృష్ణా నది ప్రవాహం, నల్లమల అటవీ ప్రాంతంలోని సహజ అందాలను ఆకాశం నుంచి వీక్షించే ప్రత్యేక అవకాశం పొందుతారు.
సోమశిల వద్ద బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండగా, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయం దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం కొనసాగుతుంది.
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలు నిర్వహించబడనున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్, రామప్ప, నిజాంసాగర్ ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.: ఆకాశ మార్గాన సోమశిల


