ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మరియు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని కొత్తగా చేరిన వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వివరించి, ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, యువకులు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ పరిణామం జిల్లాలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.: నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్
