తాడూరు మండలంలోని PACS కార్యాలయం వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తూ, వారి పంటకు సరైన ధర అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా తమ ఉత్పత్తిని విక్రయించుకోవచ్చని అన్నారు.

కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు హాజరై విజయవంతం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి గృహ సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర రెడ్డి, సర్పంచ్ మల్లయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, డైరెక్టర్లు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.: తాడూరు PACS మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *