Tag: Agriculture

ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి: కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామసభలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ రైతులు నీటి వనరులను ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుతో అధిక ఆదాయం సాధించవచ్చన్నారు.

తాడూరు PACS మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాడూరు PACS వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

భూసార పరీక్ష నేలకు శ్రీరామరక్ష

తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించి రైతులకు సేంద్రియ వ్యవసాయం, మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.