నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. వి.బి.జి. రామ్‌జీ పథకంలో భాగంగా రైతు మహేశ్వరి పొలంలో నిర్మిస్తున్న ఫామ్ పాండ్ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఫామ్ పాండ్‌ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకొని వ్యవసాయ అవసరాలకు సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. నీటి నిల్వకే పరిమితం కాకుండా ఫామ్ పాండ్ చుట్టూ తీగజాతి పంటలు, కూరగాయలు సాగు చేయడంతో పాటు చేపల పెంపకం చేపట్టి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. రైతులు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని వ్యవసాయంలో ఆదాయ మార్గాలను విస్తరించుకోవాలని అన్నారు.

రైతు మహేశ్వరి భర్త బంగారయ్య పొలంలో 12×12 మీటర్ల పరిమాణంలో రూ.1.13 లక్షల అంచనా వ్యయంతో ఫామ్ పాండ్ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పనులను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని పేర్కొనగా, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, రెండో విడతలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.: ఫామ్ పాండ్‌లతో రైతులకు అదనపు ఆదాయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *