నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ కేంద్రం సౌజన్యంతో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మేరా యువభారత్ కేంద్రం మహబూబ్నగర్ కోఆర్డినేటర్ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బగవేణి నరసింహులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీమతి కొట్టేలా లక్ష్మి సమక్షంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.

మేరా యువభారత్ చేస్తున్న ఈ కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపాల్ అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొట్టేలా లక్ష్మి, అధ్యాపకులు రాముడు, పూర్వపు అధ్యాపకుడు విజయ్ కుమార్, బోధనేతర సిబ్బంది వంశీకృష్ణ, ఆఫీస్ సబార్డినేట్ శైలజ తదితరులు పాల్గొన్నారు.: కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా సామాగ్రి పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *