నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ప్రాంత ప్రజలకు మెరుగైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ లోడ్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి వార్డ్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడం తమ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్స్ శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, విద్యుత్ సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.: 6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *