జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన..
జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు.
జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు.
కొల్లాపూర్ మండలం సింగోటం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తన వాహనంలో ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్యసాయం అందించారు. మంత్రి మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసి, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడిలో 750 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అక్రమ అబార్షన్ల ఆరోపణల నేపథ్యంలో కొల్లాపూర్‌లోని సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, మూడంచెల భద్రతతో పారదర్శకంగా లెక్కింపు నిర్వహించనున్నట్లు…