మండుటెండలో అలసిపోయి నిలబడ్డ వృద్ధ రైతు వద్దకు వెళ్లిన సీఐ అశోక్ రెడ్డి, “భోజనం చేశావా పెద్దాయన?” అంటూ ఆయన ఆరోగ్యం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారి చూపిన ఆప్యాయతకు రైతు ఆనందంగా స్పందించగా, అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాన్ని ప్రశంసించారు.
ప్రజలతో పోలీసుల అనుబంధం కేవలం చట్ట అమలుకే పరిమితం కాదని, మానవత్వంతో కూడిన వ్యవహారశైలి కూడా అంతే ముఖ్యమని ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది. నిరసన కార్యక్రమాల మధ్య కూడా సీఐ అశోక్ రెడ్డి ప్రదర్శించిన సానుభూతి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు మంచి ఉదాహరణగా నిలిచింది.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు సీఐ అశోక్ రెడ్డి వ్యవహారాన్ని అభినందిస్తూ, ప్రజలకు చేరువయ్యే ఇటువంటి పోలీసింగ్ మరింత బలోపేతం కావాలని అభిప్రాయపడుతున్నారు. పోలీసు–ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని పెంపొందించే ఇలాంటి సంఘటనలు సమాజానికి సానుకూల సందేశాన్ని ఇస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.: బీఆర్ఎస్ ఆందోళన మధ్య మానవత్వం చాటిన సీఐ అశోక్ రెడ్డి..

