అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో వైద్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణితో పాటు పలువురు వైద్యులను శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రముఖ వైద్యుడు డాక్టర్ బి.సి. రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో వారి త్యాగం, అంకితభావం సమాజానికి ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితుల్లో వైద్యులు అందించే సేవలు అమోఘమని కొనియాడారు.

ఈ సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నీట్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ విద్యార్థినికి నర్సింగ్ అధికారి సుప్రజా అందించిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆర్ఎంఓ డాక్టర్ రవి శంకర్ మాట్లాడుతూ క్లాస్మేట్ క్లబ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ జిల్లా కార్యదర్శి సి. రమణకుమార్, వాస లక్ష్మి రాఘవేందర్, వాణి, మిడిదొడ్డి సాయిరాం, ఆస్పత్రిలోని వివిధ విభాగాల అధిపతులు, ఆర్ఎంఓలు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఘన సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *