Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ పట్టణంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి: కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామసభలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ రైతులు నీటి వనరులను ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుతో అధిక ఆదాయం సాధించవచ్చన్నారు.

పశువుల వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు తప్పనిసరి: కలెక్టర్

బావాజీపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలమని, ఉచిత టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

బావాజీపల్లిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపడుతున్న చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులకు ఆదేశించారు.

నాగర్ కర్నూల్‌లో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ’పై అవగాహన సదస్సు

నాగర్ కర్నూల్ సాయి గార్డెన్‌లో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం’ కార్యక్రమం నిర్వహించారు. యువత, తల్లిదండ్రులు డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూల్‌లో ప్రధాని మోడీ 12 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా ప్రత్యేక పూజలు

భారత ప్రధానమంత్రి Narendra Modi 12 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్ కర్నూల్‌లోని రామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేటి ప్రజావాణికి 42 ఫిర్యాదులు.. సత్వర పరిష్కారానికి ఆదేశాలు:

నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 42 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకల ఆరోపణలు..

నాగర్‌కర్నూలు జిల్లా తుమ్మలసుగూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు, ఫీల్డ్ వెరిఫికేషన్‌లో లోపాలపై విచారణ చేపట్టాలని కోరారు

బిజినపల్లి గ్రామసభలో ఇందిరమ్మ చీరల దుర్వినియోగం..?

నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి మండల గ్రామసభలో ఇందిరమ్మ మహిళా చీరలను బల్లపై పరిచిన ఘటన వివాదాస్పదమైంది. ప్రభుత్వ పథకం వస్తువుల వినియోగంలో నిర్లక్ష్యం జరిగిందంటూ గ్రామస్థులు విచారణకు డిమాండ్ చేస్తున్నారు.