Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

ప్రభుత్వ వైద్య కళాశాల నాగర్‌కర్నూల్ నూతన ప్రిన్సిపాల్‌కు విద్యార్థుల ఘన స్వాగతం

ప్రభుత్వ వైద్య కళాశాల నాగర్‌కర్నూల్ నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. దావూద్ సులేమాని మహమ్మద్‌కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆయన నాయకత్వంలో కళాశాల మరింత అభివృద్ధి సాధిస్తుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

నాగర్ కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. కృష్ణ

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్ కె. కృష్ణ నాగర్ కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వేసవి శిక్షణ ముగింపు వేడుకల్లో పాల్గొన్న బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్

నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన వేసవి సాంస్కృతిక శిక్షణ తరగతుల ముగింపు వేడుకల్లో యువ హీరో, బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్ పాల్గొని గురుభక్తిని చాటుకున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి చిన్నారుల ప్రదర్శనలను అభినందించారు.

సోమశిలలో ఉమ్మడి పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

జర్నలిస్టు కూతురు చదువు కోసం ముందుకొచ్చిన జర్నలిస్టులు

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు రామస్వామి కూతురు చదువు కొనసాగించేందుకు జర్నలిస్టులు కలిసి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఐజేయూ సభ్యులు, జర్నలిస్టు నాయకులు పాల్గొని మానవత్వాన్ని చాటారు.

బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని తెలంగాణ తల్లి, అమరవీరులకు నివాళులర్పించి కార్యకర్తలకు పునరంకిత పిలుపునిచ్చారు.

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని తెలంగాణ అభివృద్ధిపై ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమరవీరులకు నివాళులర్పించిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు.

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి తెలంగాణ ఆరోగ్య రంగ అభివృద్ధి, మాతా శిశు సంరక్షణలో జిల్లాలో సాధించిన పురోగతిపై వివరించారు.

ప్రజారోగ్య సేవలకు జీవితాన్నే అంకితం చేసిన DM&HO డాక్టర్ స్వరాజ్యలక్ష్మి

నాగర్‌కర్నూల్ జిల్లా DM&HO డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి గారికి ఘన పదవీ విరమణ సన్మానం నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో మూడు దశాబ్దాల సేవలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశంసించారు.