నయినపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని నయినోనిపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని అదనపు కలెక్టర్ అమరేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మాజీ మంత్రి
నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
2027 జనగణన దేశాభివృద్ధికి కీలకం
2027 జనగణన ప్రక్రియ దేశాభివృద్ధికి కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణను అధికారులు సమన్వయంతో, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని సూచించారు.
జిల్లా ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు ఉచిత హెచ్‌పీవీ టీకా
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. అర్హులైన బాలికలు ఆధార్ జిరాక్స్ కాపీతో తల్లిదండ్రులతో కలిసి రావాలని వైద్యాధికారులు సూచించారు.
మహిళా సాధికారతతోనే ప్రభుత్వ లక్ష్యం
నాగర్ కర్నూల్ సాయి స్నేహ ఎలైట్ అపార్ట్మెంట్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మునిసిపల్ చైర్మన్ తీగల సునింద్ర తెలిపారు.
వంగూర్‌లో అక్రమ LPG గ్యాస్ వినియోగం బట్టబయలు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ సమీపంలో యోగి రెస్టారెంట్‌లో గృహ LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. రెండు సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఎల్పీజీ గ్యాస్‌పై కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.
పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన–వినోద పర్యటన
నాగర్ కర్నూల్‌లోని పల్లవి మోడల్ స్కూల్ నాలుగో, ఐదో, ఆరవ తరగతుల విద్యార్థులు మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రం, సైన్స్ మ్యూజియం మరియు మయూరి పార్క్‌ను సందర్శిస్తూ విజ్ఞాన–వినోద పర్యటనలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు మార్చి 15 నుంచి ద్వితీయ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
