నాగర్ కర్నూల్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి నాగర్ కర్నూల్ కిరాణా అసోసియేషన్ సహకారం అందించింది.

వాసవి క్లబ్ & వనిత క్లబ్ అధ్యక్షులు సంబు అపర్ణ శ్రీనివాసులు, కార్యదర్శి సంబు అనిలా పాండు, కోశాధికారి ఆకుతోట స్వాతి రాజు, సభ్యులు హకీం, రాజేష్, లక్ష్మణస్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సంబు పాండు, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కూడా హాజరయ్యారు.

భక్తులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలిచిన క్లబ్ సభ్యుల సేవలను ప్రజలు అభినందించారు. ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి.: నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *