ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సురక్షిత నాగర్‌కర్నూల్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ద్వారా నేరాల గుర్తింపు, దర్యాప్తు మరింత వేగవంతం అవుతుందని, ప్రజల సహకారంతో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నూతన సీసీ కెమెరాల ప్రారంభం..


