నాగర్‌కర్నూల్ సర్కిల్ ఆఫీస్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ (ఐపీఎస్) వార్షిక తనిఖీ నిర్వహించి కార్యాలయ పనితీరు, రికార్డుల నిర్వహణ, పోలీసు సేవల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీస్ పరిసరాలను పరిశీలించిన ఆయన, ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వారి సమస్యలను వినాలని, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శక విచారణ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రింది స్థాయి అధికారులకు కూడా ప్రజలకు సకాలంలో సహాయం అందించేలా మార్గనిర్దేశం చేయాలని చెప్పారు.

స్థానిక రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎస్పీ, రిసెప్షన్, రైటర్ మరియు ఇతర సిబ్బంది పనితీరును కూడా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి, ఎలాంటి కేసులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డికి ఆదేశించారు.

సర్కిల్ ఆఫీస్ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది క్రమశిక్షణపై జిల్లా ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్ సర్కిల్ ఆఫీస్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *