ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ మార్కెట్లను మరింత అభివృద్ధి చేసి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సౌకర్యవంతంగా విక్రయించే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు.
మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులు, సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం మార్కెట్‌లో రైతులకు మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో పాటు, మార్కెట్ కార్యకలాపాలు కూడా మరింత సులభతరం అవుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగయ్య, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.: నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన




