నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. వివిధ లబ్ధిదారులకు సంబంధించిన గృహ నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, పనుల ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, నిర్మాణాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న 99 రోజుల సంక్షేమ కార్యక్రమంలో గృహ ప్రవేశాల నాటికి, అంటే వచ్చేనెల 20వ తేదీ లోపు అన్ని ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన, సురక్షితమైన గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి ఇల్లు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము వంటి సామగ్రి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పనులు ఎక్కడా నిలిచిపోకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లబ్ధిదారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

33

అదేవిధంగా, నిర్మాణ పనుల పురోగతికి అనుగుణంగా బిల్లులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకాన్ని విజయవంతం చేయడం అందరి బాధ్యత అని పేర్కొంటూ, అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.: వచ్చేనెల 20లోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *