నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర సమస్యగా మారిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం లింగసానిపల్లి, వెంకటాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేసిన పనికి కూలి అందకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పండగ సమయంలో కూడా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస కూలి ₹307 అయినప్పటికీ, అదనపు చెల్లింపులు కూడా జరగడం లేదని విమర్శించారు.

పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, టెంట్లు, మెడికల్ కిట్లు వంటి కనీస వసతులు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.

ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించి, పెండింగ్ వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూలీలు శ్రీశైలం. మహేష్, వెంకటమ్మ, నాగేష్, రాములు, పర్వతాలు తదితరు పాల్గొన్నారు.: ఉపాధి హామీ పనుల్లో కూలీలకు వేతనాలు చెల్లించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *