దేశాభివృద్ధిలో కీలకమైన జనాభా గణనను సుమారు 15 సంవత్సరాల తరువాత చేపడుతున్న నేపథ్యంలో, ఈ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయి అవగాహనతో సిద్ధంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.

నాగర్ కర్నూల్ ఐడీఓసి సమావేశ మందిరంలో మార్చి 15 నుంచి 17 వరకు జిల్లా సెన్సస్ చార్జ్ అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా కలెక్టర్ పాల్గొని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా గణనను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు, రెండో విడత 2027 ఫిబ్రవరి నెలలో జరుగుతుందని వివరించారు.

ఈసారి భారతదేశ చరిత్రలో తొలిసారిగా జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. గణన ప్రారంభానికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 అర్ధరాత్రి వరకు “సెల్ఫ్ ఎన్యూమరేషన్” సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఇంటి యజమానులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అధికారిక పోర్టల్లో లాగిన్ అయి కుటుం | వరాలు, ఆస్తి వివరాలు, గృహ సమాచారం వంటి అంశాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చనివివరించారు.

సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా నమోదు చేసిన వివరాలు ప్రత్యేకంగా భద్రపరచబడతాయని, తర్వాత జనాభా గణన అధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆయా వివరాలను ధృవీకరించి ఫైనల్ సబ్మిట్ చేస్తారని తెలిపారు. తద్వారా వివరాలు సర్వర్లో శాశ్వతంగా నమోదు అవుతాయని చెప్పారు.

జిల్లా ప్రజలు ఈ డిజిటల్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జనాభా గణన ప్రక్రియలో జిల్లా సెన్సస్ చార్జ్ అధికారుల పాత్ర కీలకమని, వారు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి జెయింట్ డైరెక్టర్ బి. లాజర్, మాస్టర్ ట్రైనర్లు శివరామకృష్ణ, రాజేశ్వర్ మరియు టెక్నికల్ సపోర్ట్ టీమ్ సభ్యులు అధికారులకు అవగాహన కల్పించారు. సిపిఓ సుజాతతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.: డిజిటల్ విధానంలో జనాభా గణనకు సిద్ధం కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *