ఆశా వర్కర్లు తమకు నెలకు ₹18,000 ఫిక్స్డ్ వేతనం, PF, ESI, ప్రమాద బీమా వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న JAC జిల్లా అధ్యక్షుడు సాయి మహారాజ్ మాట్లాడుతూ, ఆశా వర్కర్లు గర్భిణి స్త్రీలు, చంటిపాపల తల్లులకు కీలక సేవలు అందిస్తూ తల్లిలాంటి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇలాంటి సేవలు అందిస్తున్న వారికి ప్రభుత్వం తగిన గుర్తింపు, వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సుమారు 28,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వారి సేవలకు సరిపడా వేతనం, సంక్షేమ పథకాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో JAC జిల్లా నాయకులు శివ మహారాజ్, చంద్రశేఖర్, విజయ్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.: ఆశా వర్కర్ల డిమాండ్లకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద నిరసన
