Tag: Housing Scheme

వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

నాగర్‌కర్నూల్ మండలం వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ, వీవో భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

వచ్చేనెల 20లోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించి, వచ్చేనెల 20లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

చెంచుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్‌డీటీతో ఒప్పందం

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.