నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ
మోర్చా (BJYM) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫీజుల బకాయి – BJP లడాయి’ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ఆధ్వర్యంలో ఉద్యమ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ సుమారు ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేదని ఆరోపించారు.
ఫీజులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు పరీక్షలు రాయడం, సర్టిఫికెట్లు పొందడం, ఉన్నత విద్య కొనసాగించడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలంలో విడుదల చేసేలా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని కోరారు

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు చేపడతామని ధన్నోజు నరేష్ చారి హెచ్చరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి తిరుమల్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ, నాయకురాలు జానకి, యువ మోర్చా నాయకులు పద్మ అనిల్, భగీరథ, శివాజీ, నిశ్వంత్, మిద్దె రవి, రంజిత్, సంతోష్, శివచంద్ర, డేరంగుల శివ, అరవింద్ రెడ్డి, కల్వకుర్తి మండల యువ మోర్చా అధ్యక్షుడు నాప శివ, ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు.
: ఫీజుల బకాయి – BJP లడాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *