నాగర్‌కర్నూల్, జూలై 27: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 12 అర్జీలు అందాయి. వీటిలో 8 భూమికి సంబంధించిన ఫిర్యాదులు, 4 తగు న్యాయానికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ, చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి మధ్యవర్తులు లేదా పైరవీలు లేకుండా నేరుగా పోలీస్ శాఖను సంప్రదించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. ప్రజలకు న్యాయం అందేలా, పారదర్శకంగా పోలీస్ సేవలు అందించడం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతూ, పోలీసులను ప్రజలకు చేరువ చేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిష్కరించడం కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వేగవంతమైన పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.: ప్రజావాణిలో 12 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *