అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నారుల అభ్యాస సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించిన కలెక్టర్, ఆటల ద్వారా బోధనను మరింత ప్రోత్సహించాలని, విద్యా సామగ్రిని సమర్థంగా వినియోగించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ప్రతి చిన్నారికి సరైన పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తల్లిదండ్రుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తదుపరి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు, బోధన ప్రమాణాలు, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి పరీక్షల సన్నద్ధతపై వివరాలు తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణతతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించేలా కార్యాచరణ చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఆగస్టు 10లోపు విద్యార్థులందరికీ యూనిఫాంల పంపిణీ పూర్తి చేయడంతో పాటు ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.: తెలకపల్లిలో అంగన్వాడీ, జడ్పీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ కలెక్టర్ Read more: తెలకపల్లిలో అంగన్వాడీ, జడ్పీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ కలెక్టర్
