Tag: Voiceofnagarkurnool

ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా.

నాగర్‌కర్నూల్‌లో సంచలనం సృష్టించిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ ఆర్థిక మోసం బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డా. మల్లురవి హామీ ఇచ్చినట్లు బాధితుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. జప్తు చేసిన ఆస్తులను బహిరంగ వేలం వేసి…

నాగనూల్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్..

నాగర్‌కర్నూలు జిల్లా నాగనూల్ బ్రిడ్జి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత కేబుళ్లు, దట్టమైన పొదలు, షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి భేటీ

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సమావేశమై శ్రీశైలం బ్యాక్‌వాటర్–డిండి ప్రతిపాదనతో పాటు ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.

జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలి…

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ AISF, MSF, BSF, UISF, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి సమీపంలోని సెవెంత్ సెంటర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుగుణ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.

40 ఏళ్ల సేవా ప్రస్థానంలో నూతన మైలురాయి…

నాలుగు దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న నాగర్ కర్నూల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ నూతన మైలురాయిని చేరుకుంది.

పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం…

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు, తనపై కేసు పెట్టిన కుటుంబంపై ప్రతీకారంతో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పాఠశాల పరిశుభ్రత కార్యక్రమంలో చీపురు పట్టిన కలెక్టర్ సంతోష్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ పాల్గొన్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో…

కుమ్మెర ఘటనలపై నిందితుల అరెస్ట్

కుమ్మెర జాతర ఘటనలపై నాగర్ కర్నూల్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి పలు కేసుల వివరాలు వెల్లడించారు. శిశువు మృతి కేసుతో పాటు దాడులపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు.

ఘనంగా శనేశ్వర స్వామికి పూజలు

నంది వడ్డేమాన్ గ్రామంలో శనివారం శనేశ్వర స్వామికి భక్తులు ఘనంగా తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. శని గ్రహ దోష నివారణకు ప్రత్యేక అర్చనలు, రుద్రాభిషేకాలు జరిపారు.