ఈ కవి సమ్మేళనంలో పలువురు కవులు, గాయకులు పాల్గొని తమ కవితలు, గేయాలను వినిపించారు. కవులు తమ కవితల ద్వారా రాబోయే పరాభవ నామ సంవత్సరంలో ప్రకృతి అనుగ్రహం ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రపంచ శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. మానవాళి మరియు సమస్త జీవరాశి సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని తమ భావాలను వ్యక్తపరిచారు.
గాయకులు కూడా చక్కని గీతాలతో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. సంప్రదాయ సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక మండలి సభ్యులు ముచ్చర్ల దినకర్, కవులు గుడిపల్లి నిరంజన్, వనపట్ల సుబ్బయ్య, బాస వెంకటేశ్వర్లు, కృష్ణయ్య గౌడ్, విజయకాంత్, వెంకటేశ్వర్లు, ఎదిరేపల్లి కాశన్న, జానియా, సుధాకర్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. గాయనీ గాయకులు ఇద్రిష్, ముక్తావళి, సునందచారి, టి.కె. చారి తమ గానంతో ప్రేక్షకులను అలరించారు.
కందనులు కళా సేవా సమితి అధ్యక్షులు బి. నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు డి. రాములు, బాలరాజు, సురేష్ బాబు, జిల్లా నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షులు ఆర్. సత్యం, దేవాలయ కమిటీ బాధ్యులు రమేష్, సుధీర్, దశరథం తదితరులు పాల్గొన్నారు.
ఈ ఉగాది కవి సమ్మేళనం సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా విజయవంతంగా ముగిసింది.: నాగర్ కర్నూల్‌లో ఉగాది కవి సమ్మేళనం అలరింపు

