నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్లో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి పర్యటన సేవా కార్యక్రమాలు, సమావేశాలు, సన్మానాలతో ఆద్యంతం ఆహ్లాదభరితంగా జరిగింది. 320A జిల్లాలో ప్రముఖ స్థానం కలిగిన, 35 సంవత్సరాల చరిత్ర గల నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ను ఆయన అధికారికంగా సందర్శించారు.

పర్యటనలో భాగంగా గవర్నర్ను పట్టణ పరిసర ప్రాంతంలోని జ్ఞానేశ్వరా అరక్షిత బాలికల ఆశ్రమం వద్ద క్లబ్ సభ్యులు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ ఆశ్రమవాసులతో పాటు బాటసారులకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.

తదుపరి హోటల్ హిమాలయలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్తో సమావేశం నిర్వహించి క్లబ్ కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, నాగర్ కర్నూల్ క్లబ్ క్రమశిక్షణతో ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రశంసించారు.ఈ సందర్భంగా దేవల్ తిరుమలాపూర్ పాఠశాలకు ₹13 వేల విలువైన సౌండ్ సిస్టమ్ను అందజేశారు. అలాగే సిరసవాడ పాఠశాల విద్యార్థుల కోసం ₹16 వేల విలువైన 35 స్పోర్ట్స్ డ్రెస్సులను అందించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. కారుకొండ పాఠశాలకు కూడా సౌండ్ సిస్టమ్ అందించనున్నట్లు వెల్లడించారు.

క్లబ్ సభ్యుల సహకారంతో నిర్వహించిన సేవా కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులను సన్మానించారు. మాజీ గవర్నర్ రాధాకృష్ణ, ఇతర నాయకులు క్లబ్ సేవలను కొనియాడారు.

క్లబ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కార్యదర్శి సురేష్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది.: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి పర్యటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *