నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ తెలిపారు. “మన తెలంగాణ – పరిశుభ్ర తెలంగాణ” నినాదంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ మరియు కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి సాజీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్క్షాప్లో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు కూడా ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు.పోల్యూషన్ కంట్రోల్ అధికారి సాజీనా మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ ఒక పెద్ద సమస్యగా మారిందని, దాని నియంత్రణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇతరులను కూడా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వనిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ, ముజఫర్, దశరథం, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.: ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *