నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసుకుంది. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆసుపత్రిలో నూతన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ (OT)ను గౌరవ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం ఆసుపత్రి వైద్యులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన, పారదర్శక వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఆధునిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) ఉషారాణి, ఆర్‌ఎంఓ డాక్టర్ రోహిత్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొత్త ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన శస్త్రచికిత్స సేవలు అందనున్నాయి.: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *