ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు రావలసిన ఆరు డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ (OPS) అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్థిక కార్యదర్శి హనుమంత్ రెడ్డి, బిజినపల్లి మండల అధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, హుస్సేన్ తదితర ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..


