ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఓటరికి ఈ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించాలని, ముఖ్యంగా ఆగస్టు 3వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారి వివరాలు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోయే అవకాశం ఉందని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఎవరూ నమోదు ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో అనర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగకుండా చూడడంతో పాటు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటరు నమోదు (డూప్లికేట్ ఎంట్రీలు) జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందేలా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో నాగర్‌కర్నూల్ ఆర్డీవో అర్చన, బిజినపల్లి తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో, బీఎల్‌వోలు, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు పాల్గొన్నారు.: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్




