తనిఖీ సందర్భంగా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ఫలితాల అందజేత ప్రక్రియపై ఆరా తీసి, పరీక్షల ఫలితాలు సకాలంలో రోగులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని హాజరు రిజిస్టర్లు, రోగుల నమోదు వివరాలను కూడా పరిశీలించారు.
ఉచిత మందుల నిల్వలు, అత్యవసర ఔషధాల లభ్యతను తనిఖీ చేసిన కలెక్టర్, కుక్క కాటు, పాము కాటు చికిత్సకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూచించారు. మందుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ప్రతి రోగికి నాణ్యమైన, మానవీయ వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పనిచేయాలని సూచించారు. ఆయుష్ వైద్యులు ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి, పోషకాహారం, యోగా, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, వ్యాధుల నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, రిఫరల్ వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు.: తెలకపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…


