యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆటగాళ్లకు ఉత్సాహం నింపారు.
ఈ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించబడింది. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.: ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం




